Vikram: 'పొన్నియిన్ సెల్వన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అందరిలో ఆసక్తి!

Ponniyin Selvan Pre Release Event

  • మణిరత్నం నుంచి మరో భారీ చిత్రం 
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథ 
  • హైదరాబాదులో రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఈ నెల 30వ తేదీన సినిమా రిలీజ్ 

మణిరత్నం కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో రూపొందిన సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ ఆయన పూర్తిచేసిన సినిమా ఇది. లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి ఆయన నిర్మించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.

ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను ఆయా ముఖ్యమైన ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. దాంతో టాలీవుడ్ నుంచి చీఫ్ గెస్టుగా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వస్తారనే టాక్ ఉంది. 

ఇది చోళరాజుల కాలంలో .. చారిత్రక నేపథ్యంలో నడిచే కథ. అందుకు అవసరమైన సెట్స్ కోసం .. కాస్ట్యూమ్స్ కోసం కోట్ల రూపాయలను గుమ్మరించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళుతుందని అంటున్నారు. చాలా గ్యాప్ తరువాత సౌత్ లో ఐశ్వర్య రాయ్ చేసిన సినిమా ఇది. కాకపోతే ఈ సినిమాకి 'పీఎస్ 1' అని టైటిల్ పెట్టడమే తెలుగు ఆడియన్స్ కి అసంతృప్తిని కలిగిస్తోంది. 

Vikram
Karthi
jayam Ravi
Ponniyin Selvan Movie
  • Loading...

More Telugu News