Bollywood: బాలీవుడ్​ లో మరో విషాదం.. హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ కన్నుమూత

Actor Raju Srivastava passes away at 58 in Delhi

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు
  • ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి
  • స్టాండప్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీవాస్తవ 

బాలీవుడ్ లో మరో విషయం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ (58) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవాస్తవ.. ఢిల్లీలోని ఎయిమ్స్ లో బుధవారం ఉదయం మరణించారు. గత నెల 10వ తేదీన జిమ్ లో వ్యాయామం చేస్తుండగా.. రాజుకు గుండెపోటు వచ్చింది. దాంతో, ఎయిమ్స్ లో చేరిన ఆయన అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు. గుండెపోటు నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యలు రావడంతో ఆసుపత్రిలోనే ఉండిపోయారు. ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు ఈ మధ్య ప్రకటించారు. కానీ, ఈ రోజు పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. 

మిమిక్రీ కళాకారుడైన రాజు శ్రీవాస్తవ.. రాజకీయ నాయకుల వాయిస్ ను అనుకరించేవారు. స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి పేరు తెచ్చుకున్నారు. ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ షోతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ‘మైనే ప్యార్ కియా’, ‘బాజీగర్’, ‘బాంబే టు గోవా’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. పలు రియాలిటీ షోస్ లో కూడా పాల్గొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. రాజు శ్రీవాస్తవ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  

Bollywood
Raju Srivastava
passes away
  • Loading...

More Telugu News