Kiran Abbavaram: జాబ్ మానుకుని వచ్చానంటున్న యంగ్ హీరోయిన్!

Sanjana Anand Interview

  • ఈ నెల 16న వచ్చిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'
  • హీరోయిన్ గా పరిచయమైన సంజన ఆనంద్ 
  • అవసరమైనంత మేరకే గ్లామర్ షో అంటూ వెల్లడి 
  • అభినయం ప్రధానమైన పాత్రలకే ప్రాధాన్యత అంటూ స్పష్టీకరణ

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి చాలామంది కొత్త కథానాయికలు పరిచయమయ్యారు. ఆ జాబితాలో మనకి సంజన ఆనంద్ పేరు కూడా కనిపిస్తుంది. 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఈ నెల 16వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఉంది. ఈ సినిమాలో తేజు పాత్రను పోషించిన సంజన వరుస ఇంటర్వ్యూలతో బిజీగానే ఉంది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నేను పుట్టి పెరిగింది బెంగుళూరులో .. నా మాతృభాష కన్నడ. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను .. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా రెండేళ్లు జాబ్ కూడా చేశాను. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. మంచి జాబ్ వదులుకుని వెళ్లడం ఎందుకని మా  పేరెంట్స్ అన్నారు. కానీ ఇక్కడ ఎంతో కొంత సాధించాలనే పట్టుదలతోనే వచ్చాను. 

'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాలో నా పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొత్తగా వచ్చిన హీరోయిన్స్ కి ఇలాంటి రోల్స్ దొరకడం కష్టం. నా యాక్టింగ్ బాగుందని అందరూ అంటుంటే చాలా సంతోషంగా ఉంది. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. కథలు వినడంలో బిజీగానే ఉన్నాను. కథకి అవసరమైనంత వరకూ స్కిన్ షో చేయడానికి ఓకే .. అంతకు మించిన పరిధిని దాటేది మాత్రం లేదు. ప్రధానమైన పాత్రల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతాను" అంటూ చెప్పుకొచ్చింది.

Kiran Abbavaram
Sanjana Anand
Nenu Meeku Baga Kavalasinavadini Movie
  • Loading...

More Telugu News