Muthyala Subbayya: పెళ్లి చేసుకుని నేనుపడిన తిప్పలు ఆ దేవుడికే తెలియాలి: సినీ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య

Muthyala Subbayya Interview

  • దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యది సుదీర్ఘమైన ప్రయాణం 
  • కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు
  • ఆయన ఖాతాలో అనేక సూపర్  హిట్లు 
  • తన కెరియర్లోని కష్టాలు చెప్పిన డైరెక్టర్

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యకి మంచి పేరు ఉంది. 'మామగారు' .. 'కలికాలం' .. 'ఎర్ర మందారం' వంటి సినిమాలు దర్శకుడిగా ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. చిరంజీవికి 'హిట్లర్' .. వెంకటేశ్ కి 'పవిత్ర బంధం' .. పవన్ కల్యాణ్ కి 'గోకులంలో సీత' వంటి హిట్స్ ఇచ్చారాయన. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ఆయన పంచుకున్నారు.

"నేను పుట్టింది ప్రకాశం జిల్లా 'కె.బిట్రగుంట' గ్రామంలో. టీనేజ్ లోకి వచ్చిన తరువాత నాటకాలు వేయడం మొదలుపెట్టాను. అంతవరకూ  అంతా బాగానే ఉంది కానీ, ఆ తరువాత ఏం చేయాలనే ఆలోచనలో పడ్డాను. నాటకాల్లో ఎలాగూ అనుభవం ఉంది కదా .. సినిమాల్లో ట్రై చేద్దామనే ఉద్దేశంతో చెన్నైకి వెళ్లాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉండేవాడిని .. నెలకి 150 రూపాయలు జీతంగా ఇచ్చేవారు. డబ్బులు చాలవని పెళ్లి ఆలోచన పక్కన పెట్టాను. 

కానీ అదే సమయంలో నా దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ముగ్గురు నిర్మాతలు ముందుకు వచ్చారు. అబ్బో.. ఇక వరుస అవకాశాలు వస్తాయని చెప్పేసి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తరువాత ముగ్గురు నిర్మాతల్లో ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అలా అవకాశాల కోసం ఏడేళ్లు ఎదురుచూడవలసి వచ్చింది. ఆ సమయంలో నేను పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి పరిస్థితుల్లో  నేను టి. కృష్ణగారి దగ్గర కో డైరెక్టర్ గా చేరడం జరిగింది. ఆయన దగ్గర ఆరు సినిమాలకి పని చేసిన తరువాత, దర్శకుడిగా 'అరుణ కిరణం' చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు" అని చెప్పుకొచ్చారు.

Muthyala Subbayya
T Krishna
Aruna Kiranam Movie
  • Loading...

More Telugu News