Dhanush: ధనుశ్ 'సార్' సినిమా రిలీజ్ డేట్ ఖరారు!

Sir movie release date confirmed

  • ధనుశ్ తాజా చిత్రంగా 'సార్'
  • విద్యావ్యవస్థలోని లోపాల నేపథ్యంలో కథ
  • దర్శకుడుగా వెంకీ అట్లూరి 
  • డిసెంబర్ 2వ తేదీన తెలుగు ..తమిళ భాషల్లో రిలీజ్    

తమిళంలో వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకోవడంలో సూర్య తరువాత స్థానంలో ధనుశ్ కనిపిస్తున్నాడు. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ, నేరుగా తెలుగు సినిమాలు చేయడానికి ఆయన ఉత్సాహాన్ని చూపుతూ వస్తున్నాడు. అలా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన చేసిన సినిమానే 'సార్'. విద్యా వ్యవస్థలోని లోపాలపై ఈ కథ నడవనుంది.

తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన చేస్తూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. క్లాస్ రూమ్ కి సంధించిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ సినిమాలో ధనుశ్ సరసన నాయికగా సంయుక్త మీనన్ అలరించనుంది. 

సితార .. త్రివిక్రమ్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను అదే రోజున విడుదల చేయనున్నారు. ఒకేసారి రెండు భాషల్లోను ఈ సినిమా హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Dhanush
Samyuktha
Venky Atluri
Sir Movie
  • Loading...

More Telugu News