: 5 రోజుల రెక్కీ... 30 కిలోల పేలుడు పదార్థాలు.. వెరసి ఛత్తీస్ గఢ్ ఘటన


బస్తర్ ఘాట్ లో జరిగిన మావోయిస్టుల దాడికి సంబంధించిన ప్రాధమిక నివేదికి వెలువడింది. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న తొలి మావోయిస్టుల దాడిలో భయంకరమైన నిజాలు వెలుగుచూస్తున్నాయి. దారుణానికి తెగబడడానికి ముందు మావోయిస్టులు 5 రోజుల పాటు ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు. కాంగ్రెస్ నేతల వాహనాలను పేల్చేసేందుకు 27 నుంచి 30 కిలోల పేలుడు పదార్థాలు వాడినట్టు ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు.

ఇందులో భారీ విస్పోటనం కోసం అమ్మోనియం నైట్రేట్ వాడినట్టు పేర్కొన్నారు. మందు పాతర పేల్చేందుకు 200 మీటర్ల వైరును డిటోనేటర్లకు అనుసంధానించి పేల్చారని నివేదికలో పేర్కొన్నారు. అయితే అన్నింటి కంటే దారుణవైఫల్యమేంటంటే, మావోయిస్టులు ఈ ప్రాంతంలో సుమారు 50 మంది మాటువేసి వేటు వేసినా, దాన్ని పోలీసులు పసిగట్టలేక పోయారని ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్ఐఏ రంగంలోకి దిగడంతో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News