Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా నుంచి పోస్టర్ రిలీజ్!

Varun new movie update

  • వరుణ్ 13వ సినిమా సెట్స్ పైకి
  • వైమానికదళ నేపథ్యంలో నడిచే కథ 
  • దర్శకుడిగా శక్తి ప్రతాప్ సింగ్
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న ఫస్టు పోస్టర్ 

వరుణ్ తేజ్ హీరోగా ఈ ఏడాది 'గని' ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ తరువాత వచ్చిన 'ఎఫ్ 3' ఫస్టు పార్టు స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉండనుందా అనే ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఫస్టు పోస్టర్ ను కూడా వదిలారు.  

వరుణ్ తేజ్ తాజా చిత్రం వైమానికదళం నేపథ్యంలో నడుస్తుందనే విషయం ఈ పోస్టర్ వలన అర్థమవుతోంది. ఈ సినిమాలో ఆయన యుద్ధ విమానం పైలట్ గా కనిపిస్తాడనే విషయం స్పష్టమవుతోంది. కెరియర్ పరంగా వరుణ్ కి ఇది 13వ సినిమా. సందీప్ ముద్ద నిర్మిస్తున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ఆయనకి ఇదే మొదటి సినిమా.

ఇది యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన సినిమా. తన కెరియర్లోనే ప్రత్యేకమైన సినిమా అని వరుణ్ చెప్పడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఫ్లాపులను పట్టించుకోకుండా విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ఓకే చెబుతూ, కొత్త దర్శకులతోను కలిసి పని చేయడానికి ఆయన ఉత్సాహాన్ని చూపుతుండటం విశేషం. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Varun Tej
Shakthi Prathap Singh
Tollywood
  • Loading...

More Telugu News