Balakrishna: బాలయ్యతో పూరి సినిమా ఖరారైనట్టే !

Balayya in puri Movie

  • వరుస ప్రాజెక్టులతో బిజీగా బాలయ్య 
  • షూటింగు దశలో గోపీచంద్ మలినేని మూవీ
  • సెట్స్ పైకి వెళ్లనున్న అనిల్ రావిపూడి సినిమా 
  • పూరితో మరోసారి చేసే ఛాన్స్    

బాలకృష్ణ కథానాయకుడిగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. దునియా విజయ్ ఈ సినిమాతో తెలుగు తెరకి ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నాడు. 

ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నాడు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే, పూరి జగన్నాథ్ తో చేయడానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఆల్రెడీ బాలయ్యకి పూరి ఒక లైన్ చెప్పడం జరిగిపోయిందని చెబుతున్నారు.

గతంలోనే పూరితో బాలయ్య 'పైసా వసూల్' చేశారు. పూరితో మరో సినిమా చేస్తానని అప్పుడే ఆయన మాట ఇచ్చారు. ఆ మాటకి కట్టుబడే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. బాలయ్యతో సినిమా చేసేలోగా ఆకాశ్ తో పూరి ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఆకాశ్ పూరి కూడా వరుస ఫ్లాపులతో ఉన్న సంగతి తెలిసిందే.

Balakrishna
Sruthi Haasan
Puri Jagannadh
  • Loading...

More Telugu News