Tollywood: ‘శాసన సభ’ సినిమాలో హెబ్బా పటేల్​ స్టెప్పులు!

Hebah Patel roped in for a special song in Sasanasabha

  • మరోసారి ప్రత్యేక గీతానికి ఓకే చెప్పిన హెబ్బా
  • ‘శాసనసభ’ చిత్రంలో ఐటమ్ సాంగ్
  • ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వం

‘కుమారి 21ఎఫ్’తో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటి హెబ్బా పటేల్. ఆ తర్వాత కూడా హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’తో మరో హిట్ కూడా ఖాతాలో వేసుకుంది. కానీ, తర్వాత ఆమె వెనుకబడింది. పలు మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలతో పాటు గ్లామర్ పాత్రల్లో నటిస్తోంది. అదే సమయంలో ప్రత్యేక పాటలతోనూ ఫ్యాన్స్ కు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. హీరో రామ్ ‘రెడ్’ సినిమాతో ఐటమ్‌ సాంగ్‌తో అలరించిన హెబ్బా.. ఇప్పుడు మరోసారి తనదైన స్టెప్స్ తో ఆకట్టుకోవడానికి సిద్ధం అవుతోంది. తను మరో ప్రత్యేక గీతానికి ఓకే చెప్పింది. 

 ‘శాసనసభ’ అనే ప్యాన్ ఇండియా సినిమాలో  ఆమె స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం హెబ్బా పటేల్‌ ను తీసుకున్నాడు. ఇప్పటికే పాట చిత్రీకరణ షూట్ పూర్తయిందని, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసినట్టు తెలిపారు. హెబ్బా స్టెప్పులు అదిరిపోతాయని చెప్పారు. రవి బస్రూర్ స్వరాలు అందించిన ఈ స్పెషల్ సాంగ్‌ను మంగ్లీ పాడింది. త్వరలోనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈచిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Tollywood
hebah patel
special song
Sasanasabha

More Telugu News