Team India: విరాట్ కోహ్లీ కొత్త లుక్ అదుర్స్

Virat Kohli gets a stylish haircut ahead of T20 World Cup

  • హెయిర్ కట్ చేసి కొత్త లుక్ ఇచ్చిన సెలబ్రిటీ హెయిర్ స్టయిలిష్ట్ రషీద్ సల్మాని
  • ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
  • ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో బరిలోకి విరాట్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటే కాదు అతని స్టయిల్ కూడా భిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటాడు విరాట్. తన డ్రెస్సింగ్, హెయిర్ స్టయిల్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త లుక్ లో కనిపించేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. మరీ ముఖ్యంగా హెయిర్ స్టయిల్ విషయంలో ప్రయోగాలు చేస్తుంటాడు. ప్రతి మేజర్ సిరీస్, ముఖ్యమైన ఈవెంట్లకు ముందు తన హెయిర్ స్టయిల్ మారుస్తుంటాడు.

వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో విరాట్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. తాజాగా సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ రషీద్ సల్మాని... కోహ్లీకి హెయిర్ కట్ చేసి కొత్త లుక్ ఇచ్చాడు. ఈ ఫోటోలను అతను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ‘న్యూ లుక్ ఫర్ కింగ్ కోహ్లీ’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోహ్లీ కొత్త లుక్ బాగుందని కామెంట్లు వస్తున్నాయి.

కాగా, రెండేళ్లుగా పేలవ ఫామ్ లో ఉన్న కోహ్లీ ఇటీవల ఆసియా కప్ లో సత్తా చాటి తిరిగి గాడిలో పడ్డాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ పై సెంచరీ చేసి తన పరుగుల దాహం తీరలేదని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో మొదలయ్యే టీ 20 వరల్డ్ కప్ లో అతను భారత జట్టుకు కీలకం కానున్నాడు. అంతకంటే ముందు మంగళవారం ఆస్ట్రేలియాతో మొదలయ్యే టీ20 సిరీస్ లో విరాట్ మైదానంలో కనిపించబోతున్నాడు.

Team India
Virat Kohli
hair cut
new style
  • Loading...

More Telugu News