Telangana: తెలంగాణ బీజేపీ నేత‌లతో అమిత్ షా భేటీ... పార్టీ బ‌లోపేతంపై దిశానిర్దేశం

amit shah meeting with bjp telangana leadersin hyderabad

  • తెలంగాణ విమోచ‌నా దినోత్స‌వాల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన అమిత్ షా
  • ఈట‌ల ఇంటికి వెళ్లిన కేంద్ర హోం శాఖ మంత్రి
  • అమిత్ షాతో భేటీకి హాజ‌రైన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్ది

తెలంగాణ విమోచ‌న దినోత్స‌వంలో పాల్గొనేందుకు శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శ‌నివారం న‌గ‌రంలో బిజీబిజీగా గ‌డిపారు. శ‌నివారం ఉద‌యాన్నే తెలంగాణ విమోచ‌నా దినోత్స‌వంలో పాల్గొన్న ఆయ‌న ఆ త‌ర్వాత... పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ఇంటికి వెళ్లారు. ఇటీవ‌లే రాజేంద‌ర్ తండ్రి మృతి చెందిన విష‌యాన్ని తెలుసుకున్న అమిత్ షా... ఈట‌ల కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకే ఆయ‌న ఇంటికి వెళ్లారు.

ఆ త‌ర్వాత తెలంగాణ శాఖ‌కు చెందిన బీజేపీ కీల‌క నేత‌ల‌తో అమిత్ షా ఓ కీల‌క భేటీని నిర్వ‌హించారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్‌, ఈట‌ల రాజేంద‌ర్‌, పార్టీ ముఖ్యులు వివేక్ వెంక‌ట‌స్వామి, డీకే అరుణ‌, ఇటీవ‌లే పార్టీలో చేరిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి త‌దితరులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి సంబంధించి రాష్ట్ర శాఖ నేత‌ల‌కు అమిత్ షా కీల‌క స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించిన‌ట్లు స‌మాచారం.

Telangana
BJP
Amit Shah
Komatireddy Raj Gopal Reddy
Etela Rajender
Bandi Sanjay
G. Kishan Reddy
DK Aruna

More Telugu News