Amit Shah: ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లిన అమిత్ షా

Amit Shah visits Etela Rajender house in Shamirpet

  • ఇటీవలే ఈటల రాజేందర్ తండ్రి మృతి
  • శామీర్ పేటలోని ఈటల ఇంటికి వెళ్లిన అమిత్ షా
  • ఈటలను పరామర్శించిన కేంద్ర హోం మంత్రి

హైదరాబాద్ పర్యటనలో కేంద్ర హోం మంత్రి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లారు. ఇటీవలే ఈటల రాజేందర్ తండ్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేటలో ఉన్న ఈటల ఇంటికి వెళ్లిన అమిత్ షా ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. మరోవైపు, తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అమిత్ షా పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం బీజేపీ కీలక నేతలతో సమావేశమై మునుగోడు ఉప ఎన్నికపై చర్చించారు. 

Amit Shah
Etela Rajender
Home
BJP

More Telugu News