Andhra Pradesh: ఏపీలో కొత్త‌గా ఎంఈఓ-2 పోస్టు... 679 పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం

ap government creates meo 2 posts

  • ఇప్ప‌టికే మండ‌లాల్లో ప‌నిచేస్తున్న‌ ఎంఈఓలు
  • వారికి అద‌నంగా ఎంఈఓ-2 పోస్టుల‌ను సృష్టించిన స‌ర్కారు
  • అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసిన వైసీపీ స‌ర్కారు

ఏపీలో వైసీపీ స‌ర్కారు విద్యా శాఖ‌లో కొత్త పోస్టుల భ‌ర్తీకి శ్రీకారం చుట్టింది. ఇప్ప‌టికే మండ‌లానికో మండ‌ల విద్యా శాఖాధికారి (ఎంఈఓ) ఉండ‌గా... అదే హోదాలో మండ‌ల విద్యా శాఖాధికారి-2 (ఎంఈఓ-2) పోస్టును కొత్త‌గా సృష్టించేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు శ‌నివారం అధికారికంగా ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. అకడెమిక్‌, నాన్ అకడెమిక్ కార్య‌క‌లాపాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఈ కొత్త పోస్టును సృష్టిస్తున్న‌ట్టు ఏపీ ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. 

ఏపీలో దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఈ త‌ర‌హాలో కొత్త పోస్టుల‌ను సృష్టించాల‌న్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో ఏకీకృత సర్వీస్ రూల్స్ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండ‌టంతో విద్యా శాఖ‌లో పదోన్న‌తులు నిలిచిపోయాయి. వెర‌సి మండ‌ల విద్యా శాఖాధికారుల‌పై మోయ‌లేని భారం ప‌డింది. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంపై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే... ఎంఈఓ-2 పేరిట కొత్త పోస్టుల‌ను సృష్టించిన ఏపీ ప్ర‌భుత్వం... ఆ కేట‌గిరీలో ఒకేసారి 679 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేంద‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అదే స‌మ‌యంలో ఇప్ప‌టికే ఉన్న ఎంఈఓ-1 పోస్టుల్లో మ‌రో 13 పోస్టులను ఏర్పాటు చేసేందుకు కూడా ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కొత్త‌గా సృష్టించిన ఈ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ త్వ‌ర‌లోనే మొద‌లుకానున్న‌ట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News