YSRCP: ఈ నెల 25 నుంచి శ్రీశైలంలో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు... సీఎం జ‌గ‌న్‌కు ఆహ్వానం

ap cm ys jagan recieved srisailam bramhostav invitation

  • తాడేప‌ల్లిలో జ‌గ‌న్‌ను క‌లిసిన శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి
  • శ్రీశైలం దేవ‌స్థానం ఆల‌య క‌మిటీ స‌భ్యుల‌తో క‌లిసి వ‌చ్చిన వైనం
  • జ‌గ‌న్‌కు తీర్థ ప్ర‌సాదాలు అందించిన వైసీపీ ఎమ్మెల్యే

శ్రీశైలంలోని శ్రీ భ్ర‌మ‌రాంబ మ‌ల్లికార్జున స్వామి వారి ఆల‌యంలో ఈ నెల 25 నుంచి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లిరానున్న నేప‌థ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల‌కు హాజ‌రు కావాలంటూ శుక్ర‌వారం ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆహ్వానం అందింది.

శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి... శ్రీశైలం దేవ‌స్థానం క‌మిటీ స‌భ్యులు, ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణాధికారిలతో క‌లిసి శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మోత్స‌వాల ఆహ్వాన ప‌త్రిక‌ను అందించిన చ‌క్ర‌పాణి రెడ్డి... స్వామివారి ప్రసాదాన్ని జ‌గ‌న్‌కు అంద‌జేశారు.

YSRCP
YS Jagan
Srisailam
Shilpa Chakrapani Reddy

More Telugu News