Puvvada Ajay Kumar: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో బీజేపీ పాత్ర లేదు: మంత్రి పువ్వాడ

Puvvada slams BJP

  • ఖమ్మంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ర్యాలీ
  • హాజరైన మంత్రి పువ్వాడ
  • ప్రతి అంశాన్నీ బీజేపీ రాజకీయం చేస్తోందని ఆగ్రహం
  • మతాల మధ్య చిచ్చుపెడుతోందని వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీజేపీ నేతలపై మండిపడ్డారు. తెలంగాణలో ప్రతి అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని వివాదాస్పదంగా మార్చుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసలు, స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ ఎక్కడుంది? తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో బీజేపీ పాత్ర ఉందా? అని ప్రశ్నించారు. వజ్రోత్సవాల్లో కనీసం జాతీయ జెండాలు ఇవ్వలేకపోయారని పువ్వాడ విమర్శించారు. 

అంతకుముందు ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలో చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీలో పాల్గొన్నారు. జెడ్పీ సెంటర్ నుంచి బీజీఎన్నార్ కాలేజి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పువ్వాడ ప్రసంగించారు.

Puvvada Ajay Kumar
Khammam
TRS
BJP
Telangana
  • Loading...

More Telugu News