krishnam Raju: కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్‌ నాథ్‌ సింగ్‌

Rajnath singh met krishnam raju family

  • బీజేపీ నేతలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లిన కేంద్ర రక్షణ మంత్రి
  • కుటుంబ సభ్యులు, ప్రభాస్ ను పరామర్శించి ఓదార్చిన రాజ్ నాథ్
  • సానుభూతి తెలిపి, ధైర్యం చెప్పిన బీజేపీ నేతలు

వెటరన్ సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం పరామర్శించారు. పలు అనారోగ్య సమస్యల కారణంగా కృష్ణంరాజు ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, సినీ హీరో ప్రభాస్‌ ను రాజ్ నాథ్ పరామర్శించారు.

ప్రభాస్, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి..
కృష్ణంరాజు కుటుంబ సభ్యులు, ప్రభాస్ తో రాజ్ నాథ్ కొంత సేపు మాట్లాడారు. కృష్ణంరాజు మృతిపట్ల తన సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం, ఏయే చికిత్సలు అందించారు, ఇతర వివరాలను బీజేపీ నేతలు ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు వివరించారు. ప్రభాస్ కూడా కొంతసేపు రాజ్ నాథ్ తో మాట్లాడారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చిన రాజ్ నాథ్, ఇతర బీజేపీ నేతలు అక్కడి నుంచి బయలుదేరారు.

krishnam Raju
Rajnath singh
Kishan Reddy
BJP
Hyderabad
Telangana
Prabhas
  • Loading...

More Telugu News