VH: లాకప్ లో ఉంచిన నా అంబేద్కర్ ను విడుదల చేసినప్పుడే కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాది అవుతారు: వీహెచ్

VH demands release of his Ambedkar

  • తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు
  • సీఎం కేసీఆర్ నిర్ణయం దేశానికే ఆదర్శమన్న వీహెచ్
  • గతంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు యత్నించిన వీహెచ్
  • విగ్రహాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారంటూ అప్పట్లో వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు 2019 ఏప్రిల్ 12న హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించగా, ఆ వ్యవహారం వివాదాస్పదమైంది. పంజాగుట్టలో ఆవిష్కరణ జరిగిన తర్వాత రోజే ఆ విగ్రహాన్ని ఎవరో కూల్చేయగా, వీహెచ్ మరో విగ్రహం చేయించారు. అయితే ఆ విగ్రహాన్ని ఎత్తుకుపోయి జైల్లో వేశారని, తనపైనే కేసు నమోదు చేశారని వీహెచ్ వాపోయారు. అప్పట్లో ఆయన దీనిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు కూడా లేఖలు రాశారు. 

కాగా, తెలంగాణ కొత్త సచివాలయ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వీహెచ్ స్పందించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. అయితే, లాకప్ లో ఉంచిన తన అంబేద్కర్ ను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. లాకప్ లో ఉంచిన తన అంబేద్కర్ ను విడుదల చేసినప్పుడే కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాది అవుతారని వీహెచ్ స్పష్టం చేశారు.

VH
Ambedkar
Telangana Secretariat
KCR
Telangana
  • Loading...

More Telugu News