Telangana: తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన

Rain forecast to Telangana

  • ఈరోజు పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు 
  • మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు
  • 18న బంగాళాఖాతంలో ఆవర్తన ఏర్పడే అవకాశం

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఒడిశా, పశ్చిమబెంగాల్, తీరాల వెంబడి ఆవర్తనం ఏర్పడుతుందని చెప్పింది. ఈ మేరకు హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.

  • Loading...

More Telugu News