Nikhil: రీ షూట్ దిశగా నిఖిల్ '18 పేజెస్'?

18 Pages movie update

  • నిఖిల్ హీరోగా రూపొందిన '18 పేజెస్'
  • నిర్మాణ భాగస్వామిగా ఉన్న సుకుమార్ 
  • కొన్ని సన్నివేశాల పట్ల అసంతృప్తి
  • రీ షూట్ కి నిఖిల్ ఓకే అంటూ టాక్

నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' విడుదలకి ముస్తాబై చాలాకాలమే అవుతోంది. గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ సినిమాకి సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్ డేట్ లేదు. ఎవరూ కూడా ఈ సినిమాను గురించి మాట్లాడటం లేదు.

ఎప్పుడో పూర్తయిందని చెప్పిన ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఇప్పట్లో ఉండకపోవచ్చనే టాక్ ఒకటి బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయాలనే నిర్ణయానికి రావడమే అందుకు కారణమని అంటున్నారు. 

ఇటీవలే ఈ సినిమాను సుకుమార్ చూశాడట. కొన్ని సన్నివేశాల విషయంలో ఆయన అంతగా సంతృప్తి చెందకపోవడంతో, ఆ సీన్స్ ను రీ షూట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. నిఖిల్ కూడా ఆ సీన్స్ మళ్లీ చేయడానికి ఓకే చెప్పాడని అంటున్నారు. 'కార్తికేయ 2' తరువాత నిఖిల్ - అనుపమ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మరింత జాగత్త తీసుకుంటున్నారన్న మాట.

More Telugu News