Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. తొలిరోజే వాడీవేడిగా ఉభయసభలు కొనసాగే అవకాశం!
- మూడు రాజధానులపై తొలి రోజే చర్చ జరిగే అవకాశం
- బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలు, అజెండాను ఖరారు చేయనున్న ప్రభుత్వం
- అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభమయింది. 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కానుంది. తొలుత ఇటీవల మృతి చెందిన ప్రజాప్రతినిధులకు సంతాపం ప్రకటిస్తారు. తొలిరోజు నుంచే సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక సమావేశాల తొలి రోజే మూడు రాజధానులపై చర్చ జరగబోతోంది. ఈ నేపథ్యంలో, అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈరోజు జరగబోయే బీఏసీ సమావేశాల్లో అసెంబ్లీ పని దినాలు, అజెండాను ఖరారు చేయనున్నారు. మరోవైపు, అసెంబ్లీని రద్దు చేయాలని... మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ సవాల్ విసురుతోంది.