Dhanush: ధనుశ్ తమిళ సినిమా తెలుగు వెర్షన్ కి టైటిల్ ఖరారు!

Nenu Vasthunna movie update

  • ధనుశ్ తాజా చిత్రంగా 'నానే వరువేన్' 
  • తెలుగు టైటిల్ గా 'నేనే వస్తున్నా'
  • దర్శకుడిగా సెల్వ రాఘవన్ 
  • ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు

మొదటి నుంచి కూడా ధనుశ్ ఒక ఇమేజ్ చట్రంలో చిక్కుకోకుండా వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తమిళంలోనే  కాకుండా తెలుగులోను తప్పనిసరిగా తన సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. తమిళంలో ఆయన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 'నానే వరువేన్' సినిమాను చేశాడు. 
 
తమిళంలో చేసిన సినిమాను ఈ నెలలోనే అక్కడ విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అదే రోజున తెలుగులోనూ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తెలుగులో ఈ సినిమాకి 'నేనే వస్తున్నా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.

కలైపులి థాను నిర్మించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ వారు సమర్పిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా 'ఎల్లి' కనిపించనుంది. సెల్వ రాఘవన్ తో పాటు ప్రభు .. యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Dhanush
Elli
Prabhu
Nene Vasthunna Movie
  • Loading...

More Telugu News