Simbu: ఏ గాలి ఎవరిని ఎటు తీసుకెళుతుందో: శింబు 'ముత్తు' తెలుగు ట్రైలర్ రిలీజ్!

Muthu movie trailer releaseed

  • విభిన్నమైన కథా చిత్రంలో శింబు
  • కథానాయికగా నటించిన సిద్ధి ఇద్నాని
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న  ట్రైలర్  
  • ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల

శింబు - గౌతమ్ మీనన్ కాంబినేషన్లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తమిళంలో 'వెందు తణీంధదు కాడు' టైటిల్ తో రూపొందిన ఈ సినిమా, రేపు థియేటర్లకు రానుంది. తెలుగులో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అనే టైటిల్ తో ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేస్తున్నారు. స్రవంతి మూవీస్ వారు తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ పై తెలుగు ట్రైలర్ ను వదిలారు. 'ఏ గాలి ఎవరిని ఎటు తీసుకుని వెళుతుందో ఎవరికీ తెలియదు. మొదలు ... అంతం లేనిదానినే విధి అంటారా? అందరూ తప్పించుకునే ప్రయత్నంలోనే ఉన్నారు .. కానీ మరింత ఇరుక్కుపోతున్నారు' అంటూ సాగే వాయిస్ ఓవర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

శింబు తల్లిగా ఈ సినిమాలో రాధిక కీలకమైన పాత్రను పోషించగా, ఆయన సరసన నాయికగా సిద్ధి ఇద్నాని అలరించనుంది. ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. తమిళ .. తెలుగు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

Simbu
Siddhi Idnani
Radhika
Muthu Movie

More Telugu News