KTR: 'వెల్ డన్ అన్నా'... అంటూ కిషన్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు

KTR satires on Kishan Reddy

  • సీతాఫల్ మండి రైల్వేస్టేషన్ లో లిఫ్ట్ లను ప్రారంభించిన కిషన్ రెడ్డి
  • ఎంత పెద్ద ప్రాజెక్టులు తెచ్చారో అంటూ కేటీఆర్ వ్యంగ్యం
  • కిషన్ రెడ్డికి ఇదే అతిపెద్ద ఘనత అంటూ ఎద్దేవా

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నిన్న సీతాఫల్ మండి రైల్వేస్టేషన్ లో లిఫ్ట్ లను ప్రారంభించారు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో 3 ఎలివేటర్లను ప్రారంభించారు. బహుశా ఈ బీజేపీ ఎంపీ తన నియోజకవర్గంలో సాధించిన అతిపెద్ద ఘనత ఇదే అనుకుంటా' అంటూ ఎద్దేవా చేశారు. 'వెల్ డన్ కిషన్ అన్నా... కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద భారీ ప్రాజెక్టులను తీసుకువస్తున్నందుకు..' అంటూ కేటీఆర్ సెటైర్ వేశారు. 

గత కొంతకాలంగా తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ కు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల అది మరింత ముదిరింది. సందర్భం వస్తే చాలు... ఇరు పార్టీల నేతలు పరస్పరం వాగ్బాణాలు విసురుకుంటున్నారు.  
 

KTR
Kishan Reddy
Lifts
Inauguration
Sithaphalmandi
Railway Station
TRS
BJP
Telangana
  • Loading...

More Telugu News