Etela Rajender: నయీంకే భయపడలేదు.. నీకు భయపడతానా?: సీఎం కేసీఆర్​పై ఈటల రాజేందర్​ ఫైర్​

Etela rajender fires on cm kcr

  • నమ్మిన సిద్ధాంతాన్ని వదలను, చావుకు భయపడబోనన్న ఈటల
  • స్పీకర్ రోబోలా వ్యవహరిస్తున్నారంటే అంత కోపం ఎందుకని నిలదీత
  • అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపణ

తాను గతంలో నయీం ముఠా బెదిరించినప్పుడే భయపడలేదని.. ఇప్పుడు కేసీఆర్ కు ఎలా భయపడతానని బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శాసనసభలో బీజేపీ సభ్యుల హక్కులను ప్రభుత్వం కాలరాసిందని.. స్పీకర్ ను మర మనిషి అన్నందుకు తనకు శిక్ష వేశారని.. మరి ఇన్నాళ్లూ కేసీఆర్ అన్న మాటలకు ఏం శిక్ష వేయాలని ప్రశ్నించారు. తప్పులు చేసినవాళ్లు దొరల్లా ఉంటున్నారని.. ప్రజల కోసం పనిచేసే వారికి శిక్షలు వేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో గొంతు నొక్కుతున్నారు
అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఈటల మండిపడ్డారు. గతంలో ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీకి కూడా బీఏసీలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చేవారని.. ఇప్పుడు బీఏసీ అంశం గురించి రఘునందన్ రావు అడిగినా స్పీకర్ పట్టించుకోలేదేమని నిలదీశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సభ ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించలేదని విమర్శించారు. ప్రజలు హూజూరాబాద్ లో కేసీఆర్ ను తిరస్కరించి.. తనను సభలోకి పంపారని, అలాంటిది తనను సభ నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను ఓడగొట్టేవరకు నిద్రపోనని ఈటల వ్యాఖ్యానించారు.

Etela Rajender
BJP
KCR
TRS
Telangana Assembly
Telangana
Politics
  • Loading...

More Telugu News