Droupadi Murmu: ఎలిజబెత్ రాణి అంత్యక్రియలకు హాజరవుతున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu attending Queen Elizabeth funerals
  • ఈ నెల 8న తుదిశ్వాస విడిచిన క్వీన్ ఎలిజబెత్
  • 19వ తేదీన జరగనున్న అంత్యక్రియలు
  • ఈ నెల 17 నుంచి 19 వరకు లండన్ లో గడపనున్న భారత రాష్ట్రపతి
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు ఈ నెల 19న జరగనున్నాయి. లండన్ వెస్ట్ మినిస్టర్ అబ్బేలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు క్వీన్ అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు ఆమె లండన్ లో ఉంటారు. భారతదేశం తరపున ఎలిజబెత్ రాణికి ఆమె నివాళి అర్పిస్తారు. ఈ నెల 8న క్వీన్ ఎలిజబెత్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రాణి మృతి పట్ల భారత రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాని మోదీలు సంతాపాన్ని ప్రకటించారు. రాణి మరణం నేపథ్యంలో ఈ నెల 11న భారత్ లో సంతాప దినాన్ని పాటించారు.
Droupadi Murmu
President Of India
Queen Elizabeth
Funerals

More Telugu News