Telangana: మునుగోడు ఉప ఎన్నిక వరకే టీఆర్ఎస్‌తో పొత్తు!: సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని
![cpm telangana secretary tammineni veerabhadram comments on their support to trs](https://imgd.ap7am.com/thumbnail/cr-20220914tn63219ef96e328.jpg)
- టీఆర్ఎస్ అంటే ప్రేమ లేదన్న తమ్మినేని
- కాంగ్రెస్ అంటే కోపమేమీ లేదని కూడా వెల్లడి
- టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ నేపథ్యంలోనే ఈ నిర్ణయమని వ్యాఖ్య
నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు అధికార పార్టీ టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీలపై వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్న విమర్శలపై తాజాగా సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు.
టీఆర్ఎస్‌తో పొత్తు తాత్కాలికమేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్‌తో పొత్తు మునుగోడు ఉప ఎన్నికల వరకు మాత్రమేనని తమ్మినేని తెలిపారు. కాంగ్రెస్ అంటే తమకేమీ కోపం లేదన్న తమ్మినేని... అదే సమయంలో టీఆర్ఎస్ అంటే తమకేమీ ప్రేమ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ జరుగుతున్న నేపథ్యంలోనే టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.