Amit Shah: ప్రభాస్ తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్న అమిత్ షా

Amit Shah to meet Prabhas

  • ఈ నెల 16న హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా
  • కృష్ణంరాజు కుటుంబసభ్యులతో భేటీ కానున్న కేంద్ర హోం మంత్రి
  • 17వ తేదీ ఉదయం తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరు  

తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ నెల 16వ తేదీన ఆయన హైదరాబాదుకు చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం దివంగత సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అవుతారు. 17వ తేదీ ఉదయం విమోచన వజ్రోత్సవాలకు హాజరవుతారు. పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 

ఇటీవల మునుగోడు సభ కోసం హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా... సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ తో ఆయన భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. అయితే, కేవలం ప్రభాస్ ను పరామర్శించడం కోసమే భేటీ అవుతున్నారా? లేక మరే కోణమైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది.

Amit Shah
BJP
Prabhas
Tollywood
Bollywood
Telangana
  • Loading...

More Telugu News