Prabhas: 'ఆదిపురుష్' టీజర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..!

Prabhas Adipurush teaser coming

  • దసరా సందర్భంగా అయోధ్యలో 'ఆదిపురుష్' గ్రాండ్ ఈవెంట్
  • ఈ ఈవెంట్ లో టీజర్ ను విడుదల చేయనున్న టీమ్
  • వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ లో 'ఆదిపురుష్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా చిత్రీకరణ ముగిసినప్పటికీ... ఇప్పటి వరకు పెద్దగా అప్డేట్స్ రాలేదు. వీఎఫ్ఎక్స్ పనులు సాగుతున్నాయని ఒకసారి, వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను విడుదల చేస్తామని మరోసారి అప్డేట్స్ వచ్చాయి. ఇంతర వరకు కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ పూర్తి నిరాశలో ఉన్నారు. ఫస్ట్ లుక్ అయినా విడుదల చేస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 

ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయేలా ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఫస్ట్ లుక్ కాదు.. ఏకంగా టీజర్ నే విడుదల చేయబోతున్నారు. దసరా పండుగ సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో నిర్వహించబోయే గ్రాండ్ ఈవెంట్ లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత సినిమా విడుదల అయ్యేంత వరకు ప్రమోషన్ కార్యక్రమాలు ఏకధాటిగా కొనసాగనున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

Prabhas
Adipurush
Bollywood
Tollywood
Teaser
  • Loading...

More Telugu News