Allu Arjun: మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్!

Allu Arjun in  Trivikram movie

  • 'పుష్ప 2' కోసం రెడీ అవుతున్న బన్నీ 
  • ఆ తరువాత సినిమా త్రివిక్రమ్ తో 
  • ఆల్రెడీ ఇద్దరి ఖాతాలో హ్యాట్రిక్ హిట్
  •  ప్రస్తుతం మహేశ్ మూవీతో బిజీగా ఉన్న త్రివిక్రమ్

ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమా తరువాత బన్నీతో చేయడానికి కొంతమంది దర్శకులు లైన్లో ఉన్నారు. కానీ బన్నీ మాత్రం ముందుగా త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలనే ప్లాన్ తో ఉన్నాడని టాక్. ఆల్రెడీ ఓ మాటను త్రివిక్రమ్ చెవిన వేశాడని అంటున్నారు.

మొదటి నుంచి కూడా  త్రివిక్రమ్ తో చేయడానికి బన్నీ ఆసక్తిని చూపుతూనే వచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అల వైకుంఠపురములో' సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. అందువలన ఇప్పుడు మరోసారి  త్రివిక్రమ్ తో చేయడానికి బన్నీ  ఆసక్తిని కనబరుస్తున్నాడట. 

మరోపక్క, ప్రస్తుతం మహేశ్ బాబు 28వ సినిమాను పట్టాలెక్కించడానికి త్రివిక్రమ్ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తయ్యేనాటికి, బన్నీ 'పుష్ప 2' కూడా పూర్తవుతుంది. అందువలన ముందుగానే  త్రివిక్రమ్ ను బన్నీ లైన్లో పెట్టేశాడు. ఆ తరువాత  సినిమాను మాత్రం ఆయన బోయపాటితో చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Allu Arjun
Pushpa 2 Movie
Trivikram Movie
  • Loading...

More Telugu News