Masood Azhar: మౌలానా మసూద్ అజార్ ని అరెస్ట్ చేయాలంటూ ఆఫ్ఘనిస్థాన్ కు లేఖ రాసిన పాకిస్థాన్

Pakistan writes letter to Afghanistan to arrest Masood Azhar

  • మసూద్ అజార్ ఆఫ్ఘనిస్థాన్ లోని నంగర్ హర్, కన్హర్ ప్రాంతాల్లో ఉన్నారంటున్న పాక్ మీడియా
  • ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ లో ఉన్న పాకిస్థాన్
  • ఎఫ్ఏటీఎఫ్ ఒత్తిడి మేరకే ఆఫ్ఘనిస్థాన్ కు లేఖ

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ ను అరెస్ట్ చేయాలని ఆఫ్ఘనిస్థాన్ కు పాకిస్థాన్ లేఖ రాసింది. ఈ మేరకు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాకిస్థాన్ మీడియా ప్రకారం మసూద్ అజార్ ఆఫ్ఘనిస్థాన్ లోని నంగర్ హర్, కన్హర్ ప్రాంతాల్లో ఉన్నారు. ఇంటర్నేషనల్ వాచ్ డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్ లో పాకిస్థాన్ ఉన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలంటూ ఎఫ్ఏటీఎఫ్ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఈ లేఖ రాసినట్టు పాక్ మీడియా సంస్థ బోల్ న్యూస్ తెలిపింది. గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకు ఈ లేఖ రాసినట్టు పేర్కొంది. మరోవైపు లష్కరే తోయిబా ఆపరేషనల్ కమాండర్ సాజిద్ మీర్ పై పాక్ ఇటీవలే చర్యలు తీసుకుంది.

More Telugu News