: గుంటూరులో వడ్డీ వ్యాపారుల జులుం
గుంటూరులో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. వడ్డీ వ్యాపారుల ధాటికి సామాన్యజనం ఇళ్లొదిలి పారిపోతున్నారు. వడ్డీ వ్యాపారులు చక్రవడ్డీ, బారువడ్డీలతో జనాన్ని పీక్కుతింటున్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం దగ్గర్నుంచి, మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తూ వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. తాజాగా ఓ వడ్డీ వ్యాపారి కిడ్నీ అమ్మి తన అప్పు తీర్చాలని డిమాండ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతుండడంతో రాణీ అనే బాధితురాలు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారంపై ఆగష్టు 1 వ తేదీ నాటికి సమగ్రనివేదిక ఇవ్వాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.