Chiranjeevi: తార్ మార్ తక్కర్ మార్... 'గాడ్ ఫాదర్' నుంచి చిరంజీవి, సల్మాన్ ఖాన్ పాట ప్రోమో రిలీజ్

Chiranjeevi and Salman Khan song promo out now

  • చిరంజీవి ప్రధాన పాత్రలో గాఢ్ ఫాదర్
  • మోహన్ రాజా దర్శకత్వంలో చిత్రం
  • చిరంజీవి, సల్మాన్ పై హుషారైన గీతం
  • తమన్ బాణీలకు అనంత శ్రీరామ్ సాహిత్యం
  • నృత్యరీతులు సమకూర్చిన ప్రభుదేవా

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

కాగా, చిరంజీవి, సల్మాన్ ఖాన్ లపై చిత్రీకరించిన పాట తాలూకు ప్రోమోను చిత్రబృందం నేడు రిలీజ్ చేసింది. 'తార్ మార్ తక్కర్ మార్' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తుందనడంలో సందేహం లేదు. తమన్ బాణీలకు అనంత శ్రీరామ్ సంగీతం అందించాడు. ఈ హుషారైన గీతానికి ప్రభుదేవా నృత్యరీతులు సమకూర్చాడు. 'తార్ మార్ తక్కర్ మార్' పూర్తి పాటను సెప్టెంబరు 15న విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. 

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. సత్యదేవ్ కీలక పాత్ర పోషించగా, దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ పాత్రలో కొద్దిసేపు తళుక్కుమంటారు. 

'గాడ్ ఫాదర్' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Chiranjeevi
Salman Khan
God Father
Thaar Maar Thakkar Maar
Song Promo

More Telugu News