Pavan kalyan: ఆ రెండు సినిమాలకూ డేట్స్ ఇచ్చిన పవన్!

Hari Hara Veera Mallu movie update

  • 'వీరమల్లు'గా కనిపించనున్న పవన్ 
  • కొంతవరకూ జరిగిన షూటింగ్ 
  • అక్టోబర్ నుంచి తదుపరి షెడ్యూల్ 
  • వచ్చే వేసవికి రిలీజ్ చేసే ఆలోచన
  • 'వినోదయా సితం' రీమేక్ విషయంలో క్లారిటీ  

పవన్ కల్యాణ్ హీరోగా 'హరి హర వీరమల్లు' సినిమాను దర్శకుడు క్రిష్ సెట్స్ పైకి తీసుకుని వెళ్లి చాలాకాలమే అయింది. ఈ సినిమాకి ఎ.ఎమ్.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఆ తరువాత నుంచి రాజకీయాలలో పవన్ మరింత బిజీ అయ్యారు. దాంతో ఈ సినిమాను ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడనేది తెలియడం లేదు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి అక్టోబర్ నెల చివరి నుంచి పవన్ వరుస డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగును పూర్తి చేయాలనీ, వచ్చే వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా చెబుతున్నారు. 

అలాగే సముద్రఖని దర్శకుడిగా రూపొందనున్న 'వినోదయా సితం' రీమేక్ కోసం కూడా పవన్ 20 రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్టుగా సమాచారం. అది చిన్న సినిమా కావడం .. పవన్ పాత్ర నిడివి తక్కువగానే ఉండటం వలన 20 రోజుల్లోనే ఆయన పోర్షన్ ను పూర్తి చేయనున్నారు. ఇక 'భవదీయుడు భగత్ సింగ్' సంగతేమిటనేదే చూడాలి.

Pavan kalyan
Nidhi Agarwal
Hari Hara Veeramallu Movie
  • Loading...

More Telugu News