African Man: 15 మంది భార్యలు.. 107 మంది పిల్లలు.. అంతా హ్యాపీ అంటున్న ఫ్యామిలీ మ్యాన్‌.. వీడియో ఇదిగో

African man has 15 wives and 107 children

  • అందరం కలిసి ఒకే చోట నివసిస్తున్నామంటున్న డేవిడ్ సకయో
  • కింగ్ సాలోమన్ స్ఫూర్తితో ఇలా చేశానని వెల్లడి
  • అంత మంది భార్యలున్నా గొడవలే ఉండవని వివరణ

ఇవాళ అన్నీ చిన్న కుటుంబాలే. ఐదారుగురు ఉన్నా గొడవలు. ఇప్పుడైతే కనబడటం లేదుగానీ.. ఒకప్పుడు ఇద్దరు భార్యలు ఉన్న ఇళ్లు అయితే రణరంగాలుగానే ఉండేవి. ఇక ఇప్పుడైతే ఉన్న ఒక్క ఫ్యామిలీని పోషించడానికే కిందా మీదా పడాల్సిన పరిస్థితి. కానీ కెన్యాకు చెందిన డేవిడ్ సకయో కలుహన మాత్రం 15 మంది భార్యలతో దర్జాగా బతికేస్తున్నాడు.

కింగ్ సోలోమన్ స్ఫూర్తితో అంటూ..
పశ్చిమ కెన్యాలోని ఓ గ్రామంలో డేవిడ్ సకయో నివసిస్తుంటాడు. ప్రస్తుతం ఆయన వయసు 61 ఏళ్లు. ఆఫ్రికా ప్రాంతంలోని ఒకప్పటి చక్రవర్తి కింగ్ సోలోమన్ స్ఫూర్తితో.. ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవాలన్నది ఆయన కల. కింగ్ సోలోమన్ ఏకంగా 700 మందిని పెళ్లి చేసుకున్నాడన్నది అక్కడి గాథల్లో ఉంది. 

ఈ క్రమంలోనే డేవిడ్ సకయో ఒకరి తర్వాత ఒకరిగా 15 మందిని పెళ్లి చేసుకున్నాడు. వారి ద్వారా ఆయనకు 107 మంది పిల్లలు కూడా కలిగారు. ఇంత మంది ఉన్నా అంతా ఒకే చోట కలిసే ఉంటామని, భార్యల మధ్య ఎప్పుడూ గొడవలు రావని.. ఉన్నదేదో అంతా పంచుకుని జీవిస్తారని డేవిడ్ సకయో చెబుతున్నాడు. అంతా పరస్పరం ప్రేమతో వ్యవహరిస్తారని అంటున్నాడు.

ఇంకో 20 మంది అయినా సమస్య లేదట! 

  • ‘‘నేను కింగ్ సోలోమన్ ను. నన్ను ఒక మహిళ భరించడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికి 15 మంది అయ్యారు. ఇంకో 20 మంది అయినా నాకేం సమస్య లేదు..” అని డేవిడ్ సకయో అంటున్నాడు. 
  • ‘‘మా ఆయన మరికొందరు మహిళలను పెళ్లిచేసుకుని తెచ్చుకున్నందుకు నాకేమీ ఇబ్బందిగా లేదు. అతను బాధ్యతాయుతమైన వ్యక్తి. ఆయన ఏం చేసినా సరిగానే చేస్తారు. ఆలోచించి చేస్తారు” అంటోంది డేవిడ్ ను 1998లో పెళ్లి చేసుకున్న జెస్సికా.
  • ఇక ‘‘మేమంతా ప్రేమగా, ఆనందంగా కలిసి జీవిస్తున్నాం. మాకేమీ సమస్యలు లేవు. నా తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నప్పుడు కొంత కోపం ఉండేది. తర్వాత అంతా సర్దుకున్నాయి..” అని డేవిడ్ సకయో మరో భార్య రోస్ తెలిపింది. తనకు 15 మంది పిల్లలని ఆమె వివరించింది.

  • Loading...

More Telugu News