Woman: మేకప్​ లేకుండా అందాల పోటీల్లో అలరిస్తున్న భామ!

Woman becomes first in national beauty pageants history to compete without any makeup

  • మిస్ ఇంగ్లండ్ పోటీలో నిలిచిన 20 ఏళ్ల మెలిసా రవూఫ్
  • ఎలాంటి మేకప్ లేకుండానే ఫైనల్స్ వరకు వచ్చిన అందాల రాశి
  • త్వరలో జరిగే ఫైనల్స్ లో మరో 40 మందితో పోటీ పడనున్న మెలిసా

సాధారణంగా ఏదైనా వేడుక జరిగినా, శుభకార్యాలకు వెళ్లినా మహిళలు మేకప్ లేకుండా కనిపించరు. చర్మం నుంచి కనురెప్పల దాకా వివిధ రకాల కాస్మెటిక్స్ వాడుతుంటారు. అదే అందాల పోటీలు అంటే.. మేకప్ కు మరింత ప్రాధాన్యత ఇస్తుంటారు. అదే పెద్ద పెద్ద పోటీల్లో అయితే మేకప్ తో అందానికి మెరుగులు దిద్దుకున్న అమ్మాయిలే కనిపిస్తుంటారు. అయితే ఇంగ్లండ్ లో జరుగుతున్న మిస్ ఇంగ్లండ్ పోటీల్లో మాత్రం ఓ అతివ.. ఇందుకు భిన్నమైన రికార్డు సృష్టించింది. ఆమె పేరు మెలీసా రవూఫ్.

94 ఏళ్ల పోటీల చరిత్రలో..
లండన్ కు చెందిన 20 ఏళ్ల మెలీసా రవూఫ్.. మిస్‌ ఇంగ్లండ్‌ అందాల పోటీలో ఎటువంటి మేకప్‌ లేకుండా పాల్గొంది. 94 ఏళ్ల ఈ అందాల పోటీల చరిత్రలో ఇలా మేకప్ లేకుండా పాల్గొన్న తొలి మహిళ మెలీసా రవూఫ్ కావడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొనడమే కాదు.. ఫైనల్స్ వరకు ఈమె దూసుకెళ్లింది కూడా.
  • 2019లో జరిగిన మిస్‌ ఇంగ్లండ్‌ అందాల పోటీల్లో కంటెస్టెంట్లు మేకప్‌ లేకుండానే పాల్గొనే ఒక రౌండ్‌ ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అది అంతగా ఆకట్టుకోలేదు.
  • అయితే పోటీలో మొదటి నుంచి ఫైనల్ దాకా ఓ యువతి ఇలా మేకప్‌ లేకుండా పాల్గొనడం ఇదే తొలిసారి అని పోటీల నిర్వాహకులు వెల్లడించారు.
  • మహిళలు బాహ్య సౌందర్యంతోపాటు అంతః సౌందర్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చాటి చెప్పేందుకు.. వివిధ సౌందర్య సాధనాల కంపెనీలు అందానికి చెప్పే కొలమానాలను సవాల్ చేసేందుకే తాను మేకప్‌ లేకుండా పోటీలో పాల్గొంటున్నట్టు మెలీసా పేర్కొంది.
  • మెలసా తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. మిస్‌ ఇంగ్లండ్‌ కిరీటం కోసం అక్టోబర్‌ 17న ఫైనల్స్‌ జరుగనున్నాయి. ఆ పోటీలో మరో 40 మందితో మెలీసా పోటీపడనుంది.
 

  • Loading...

More Telugu News