Sudheer Babu: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే!

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Update

  • ఇంద్రగంటి నుంచి మరో విభిన్న చిత్రం 
  • సుధీర్ బాబు జోడీగా కృతి శెట్టి 
  • సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్ 
  • ఈ నెల 16వ తేదీన సినిమా విడుదల

సుధీర్ బాబు - కృతి శెట్టి జంటగా నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా, ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో రేపు ఈ వేడుకను నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుందంటూ అధికారిక పోస్టర్ ను వదిలారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా ఎవరు వస్తారనే విషయాన్ని ప్రకటించవలసి ఉంది. మైత్రీ - బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. 

సినిమా దర్శకుడిగా సుధీర్ బాబు .. డాక్టర్ పాత్రలో కృతి శెట్టి నటించిన ఈ సినిమాలో, అవసరాల .. వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇంద్రగంటి -  సుధీర్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో, ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. ఈ ఏడాదిలో ఇది కృతి నుంచి వస్తున్న మూడో సినిమా కావడం విశేషం. 

More Telugu News