TDP: ఇట్టాగే వాగుతుంటే తగిన బుద్ధి చెబుతాం!... కొడాలి నానికి అమ‌ర్‌నాథ్ రెడ్డి హెచ్చ‌రిక‌!

tdp leader N Amarnath Reddy fires on kodali nani

  • టీడీపీపై వ‌రుస విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న కొడాలి నాని
  • నాని తీరుపై సోష‌ల్ మీడియాలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అమ‌ర్‌నాథ్ రెడ్డి
  • ఇంటి ముందు రోడ్డు కూడా వేయించుకోలేని స‌న్నాసివి అంటూ ఘాటు వ్యాఖ్య‌

టీడీపీ నేత‌ల‌పై... ప్ర‌త్యేకించి ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్న వైసీపీ నేత‌, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇట్టాగే వాగుతుంటే త‌గిన బుద్ధి చెబుతామంటూ ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. ఈ మేర‌కు సోమ‌వారం అమ‌ర్‌నాథ్ రెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు.

ప్ర‌జ‌లు నిన్ను గెలిపించింది నియోజక‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయ‌డానికంటూ కొడాలి నానికి అమ‌ర్‌నాథ్ రెడ్డి గుర్తు చేశారు. అంతేగానీ బూతుల‌తో టీడీపీ నాయ‌కుల‌పై దాడి చేయ‌డానికి కాద‌ని కూడా ఆయ‌న సూచించారు. నీ ఇంటి ముందు రోడ్డు కూడా వేయించుకోలేని స‌న్నాసి వెధ‌వవి నీవు అంటూ ఆయ‌న ఘాటు వ్యాఖ్య చేశారు. టీడీపీపైనా, చంద్ర‌బాబు కుటుంబంపైనా బూతులతో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ సాగితే త‌గిన బుద్ధి చెబు‌తామ‌ని అమ‌ర్‌నాథ్ రెడ్డి హెచ్చ‌రించారు.

TDP
YSRCP
Chandrababu
Kodali Nani
N Amarnath Reddy
Social Media

More Telugu News