Krishnam Raju: ప్రారంభమైన కృష్ణంరాజు అంతిమయాత్ర

Krishnam Raju final journey begins

  • ఈ మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు
  • ప్రత్యేక వాహనంలో అంతిమయాత్ర
  • మొయినాబాద్ కనకమామిడి ఫాంహౌస్ లో అంత్యక్రియలు
  • ఫాంహౌస్ కి తరలివచ్చిన అభిమానులు   

తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి వేలాది మంది అభిమానులు తరలి రాగా, కృష్ణంరాజు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచారు. ఈ వాహనం మొయినాబాద్ లోని కనకమామిడి ఫాంహౌస్ కు చేరుకోనుంది. అక్కడ అధికారిక లాంఛనాలతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

అటు, కనకమామిడి ఫాంహౌస్ లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్ వద్ద కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రాంతానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు.

అంతకుముందు, జూబ్లీహిల్స్ లో కృష్ణంరాజు పార్థివదేహాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు.

Krishnam Raju
Final Journey
Demise
Moinabad
Kanakamamidi Farm House
Hyderabad
  • Loading...

More Telugu News