Mahesh Babu: మరో కొత్త లుక్ తో అదరగొడుతున్న మహేశ్ బాబు... ఫొటోలు ఇవిగో!

Mahesh Babu new look gone viral

  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో కొత్త చిత్రం
  • నేటి నుంచి షూటింగ్
  • స్లిమ్ లుక్ లో సూపర్ స్టార్
  • కొత్త హెయిర్ స్టయిల్, గడ్డంతో కనిపిస్తున్న మహేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అతడు, ఖలేజా తర్వాత వస్తున్న మూడో చిత్రం నేడు సెట్స్ మీదకు వెళుతోంది. మహేశ్ బాబు కెరీర్ లో ఇది 28వ చిత్రం.

కాగా ఈ సినిమా కోసం మహేశ్ బాబు లుక్ చాలా కొత్తగా ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో స్లిమ్ గా ఉన్న మహేశ్ బాబు హెయిర్ స్టయిల్, గడ్డం కూడా మార్చేశారు. 

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న కొత్త చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయిక.

Mahesh Babu
New Look
SSMB28
Trivikram Srinivas
Tollywood
  • Loading...

More Telugu News