Krishnam Raju: ప్రభాస్ సోదరుడి చేతుల మీదుగా కృష్ణంరాజు అంత్యక్రియలు

Krishnam Raju funerals today

  • నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కృష్ణంరాజు 
  • మొయినాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు
  • తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. కాసేపట్లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి లో ఉన్న ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. 

సినీ నటుడు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం కృష్ణంరాజు భౌతికకాయం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద ఉంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను కడసారి చూసుకుని, నివాళి అర్పిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో కొంత కాలంగా బాధ పడుతున్న కృష్ణంరాజు నిన్న తెల్లవారుజామున 3.25 గంటలకు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

Krishnam Raju
Funerals
Telangana Government
Tollywood
  • Loading...

More Telugu News