SIIMA: సైమా అవార్డుల్లోనూ 'పుష్ప' జోరు

Pushpa gets six awards in SIIMA

  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప
  • బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ ప్రభంజనం
  • సైమాలో 12 కేటగిరీల్లో నామినేషన్లు
  • 6 అవార్డులు కైవసం

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' బాక్సాఫీసు వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో బన్నీ హవా చాటిన చిత్రం పుష్ప. తాజాగా సైమా వేడుకలోనూ 'పుష్ప' తగ్గేదేలే అంటూ అవార్డులు కొల్లగొట్టింది. 

ఉత్తమ చిత్రం (పుష్ప), ఉత్తమ నటుడు (అల్లు అర్జున్), ఉత్తమ దర్శకుడు (సుకుమార్), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్), ఉత్తమ లిరిక్ రైటర్ (చంద్రబోస్), ఉత్తమ సహాయనటుడు (జగదీశ్)... ఇలా అవార్డుల మోత మోగించింది. సైమాలో మొత్తం 12 కేటగిరీల్లో పోటీపడిన పుష్ప 6 అవార్డులు సొంతం చేసుకుంది. కాగా, పుష్ప-2 కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. బన్నీ-సుక్కు కాంబోలో వచ్చే ఈ చిత్రంపై అప్పుడే భారీ హైప్ నెలకొంది.

SIIMA
Awards
Pushpa
Allu Arjun
Sukumar
  • Loading...

More Telugu News