TTD: టీటీడీలో ఉద్యోగాల పేరిట మోసం కేసులో ముగ్గురి అరెస్ట్
- టీటీడీలో ఉద్యోగాలు అంటూ డబ్బు వసూలు
- 15 మంది నుంచి రూ.1.5 కోట్లు వసూలు
- నిందితులు ముగ్గురు తిరుపతి నగరపాలక సంస్థ ఉద్యోగులే!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు తిరుమలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్టు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ముగ్గురు తిరుపతి కార్పొరేషన్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. శానిటరీ ఇన్ స్పెక్టర్ వెంకటరత్నం, నగరపాలక కమిషనర్ డ్రైవర్ హేమంత్, మరొక ఉద్యోగి శివ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. వీరు 15 మంది నుంచి రూ.1.5 కోట్లు వసూలు చేసినట్టు గుర్తించారు.