Congress: ‘భారత్ జోడో’ యాత్రలో రాహుల్ ‌గాంధీ పెళ్లి ప్రస్తావన.. ఓకే అంటే తమిళ యువతితో పెళ్లి చేస్తామన్న మహిళ

Rahul Gandhi marraige proposal in bharat jodo yatra

  • భారత్ జోడో యాత్రలో సరదా సన్నివేశం
  • ఉపాధి కూలీలతో మాట్లాడిన రాహుల్
  • రాహుల్ చాలా ఉత్సాహంగా కనిపించారన్న జైరాం రమేశ్

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. నిన్న ఉదయం కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైన రాహుల్ యాత్ర మధ్యాహ్నం అదే జిల్లాలోని మార్తాండం ప్రాంతానికి చేరుకుంది. అక్కడే ఆయన భోజన విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉపాధిహామీ కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు తదితర విషయాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా వారి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది.

ఓ మహిళ రాహుల్‌తో మాట్లాడుతూ.. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. మీరు తమిళనాడును అమితంగా ప్రేమిస్తారన్న విషయం తమకు తెలుసని, మీరు ఓకే అంటే తమిళ యువతితో వివాహం చేసేందుకు తాము రెడీగా ఉన్నామని అన్నారు. వారితో జరిగిన సంభాషణ వివరాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ చాలా ఉత్సాహంగా కనిపించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ నవ్వుతున్న ఫొటోలను ట్వీట్ చేశారు.

Congress
Bharat Jodo Yatra
Rahul Gandhi
Tamil Nadu

More Telugu News