KCR: రెబల్ స్టార్‌గా అభిమానుల హృదయాల్లో కృష్ణంరాజుకు సుస్థిర స్థానం: కేసీఆర్

Telangana CM KCR Condolence To Actor Krishnam Raju death
  • కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపిన సీఎం
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా పాలనారంగం ద్వారా ప్రజలకు సేవలు అందించిన ఆయన మృతి విచారకరమని పేర్కొన్నారు. కృష్ణంరాజు తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో విలక్షణ నటనాశైలితో రెబల్ స్టార్‌గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. 

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 83 సంవత్సరాల కృష్ణంరాజు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారు జామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.
KCR
Chief Minister
Telangana
krishnam raju
actor

More Telugu News