Woman: వైజాగ్ లో పరీక్షకు హాజరయ్యేందుకు... వరదతో ఉప్పొంగుతున్న నదిని ప్రమాదకరరీతిలో దాటిన యువతి... వీడియో ఇదిగో!

Woman cross river by swim to attend exam in Vizag

  • వరదతో పోటెత్తుతున్న చంపావతి నది
  • పరీక్ష కోసం సాహసానికి ఒడిగట్టిన యువతి
  • సోదరుల సాయంతో నదిలో దిగిన వైనం
  • ఎంతో ధైర్యంగా పయనించి ఒడ్డుకు చేరిన వైనం

ఏపీలో ఇప్పటికీ అనేక గ్రామీణ ప్రాంతాలకు సరైన రవాణా సదుపాయాలు లేవు. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిస్తే చాలు... ఉన్న కొద్దిపాటి మార్గాలు కూడా మూసుకుపోతాయి. అలాంటి పరిస్థితుల్లోనే విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మర్రివలస గ్రామానికి చెందిన ఓ యువతి అత్యంత సాహసానికి ఒడిగట్టింది. 

వైజాగ్ లో పరీక్షకు హాజరవడం కోసం, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చంపావతి నదిని దాటింది. ఆ సమయంలో చంపావతి నది వరద నీటితో ఉప్పొంగుతోంది. కానీ పరీక్ష ముఖ్యమైనది కావడంతో ఆ 21 ఏళ్ల యువతి తన ఇద్దరు సోదరుల సాయంతో నదిలో మునుగుతూ, లేస్తూ ఎట్టకేలకు ఒడ్డుకు చేరుకుంది. ఓవైపు వరద నీరు సుడులు తిరుగుతూ భీకరంగా ప్రవహిస్తున్నప్పటికీ, వారు ముగ్గురూ ధైర్యంగా నదిని దాటారు. దీనికి సంబధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Woman
Exam
River
Vijag

More Telugu News