YS Sharmila: వైఎస్సార్ బిడ్డవైతే మునుగోడులో పోటీ చేసి నీ సత్తా ఏంటో చూపించు: షర్మిలకు నిరంజన్ రెడ్డి సవాల్

Niranjan Reddy challenge to YS Sharmila

  • నీ తండ్రి ఆదాయపు పన్ను కట్టకముందే నేను కట్టానన్న మంత్రి 
  • తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడే నా బిడ్డలను విదేశాల్లో చదివించానని వెల్లడి 
  • రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీదని విమర్శ 

తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను మంగళవారం మరదలు అన్నాడని.. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కార హీనుడు అంటూ ఆమె మండిపడ్డారు. అసలు ఎవడ్రా నీవు? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో షర్మిలపై నిరంజన్ రెడ్డి అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఒక్క మాటకు వంద మాటలు అంటామని హెచ్చరించారు. 

నీవు రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చేసి నీ సత్తా ఏంటో చూపించాలని సవాల్ విసిరారు. నీ తండ్రి వైఎస్ ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా పన్ను కట్టిన వాడినని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే తన బిడ్డలను విదేశాల్లో చదివించానని చెప్పారు. వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు తెచ్చి ప్రతి ఎకరాకు నీరు పారించిన చరిత్ర తనదని అన్నారు. 22 ఏళ్లుగా తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన ఉద్యమకారుడిని తానని చెప్పారు. రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది అని మండిపడ్డారు.

YS Sharmila
YSRTP
Niranjan Reddy
TRS
YSR
  • Loading...

More Telugu News