Nalgonda District: చ‌ల‌మ‌ల కృష్ణారెడ్డితో క‌లిసి రేవంత్‌తో భేటీ అయిన పాల్వాయి స్ర‌వంతి

palvai sravanthi meets revanth reddy with chalamala krishna reddy

  • మునుగోడు కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పాల్వాయి స్ర‌వంతి ఎంపిక‌
  • టికెట్ కోసం స్ర‌వంతితో పోటీ ప‌డిన చ‌ల‌మ‌ల కృష్ణారెడ్డి
  • ఇద్ద‌రూ క‌లిసి రేవంత్‌తో భేటీ అయిన వైనం

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌కు కాంగ్రెస్ పార్టీ కార్య‌రంగాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుందో కూడా తెలియ‌కుండానే పార్టీ అభ్య‌ర్థిగా సీనియ‌ర్ నేత పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్ర‌వంతిని ఖ‌రారు చేసిన టీపీసీసీ... ఉప ఎన్నిక‌లో పార్టీ టికెట్ కోసం య‌త్నించి భంగ‌ప‌డ్డ నేత‌ల‌ను కూడా ఎన్నిక‌ల్లో భాగ‌స్వామ్యం చేసే దిశ‌గా సాగుతోంది. 

ఇందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నిక‌ల కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి శ‌నివారం హైద‌రాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె వెంట టికెట్ కోసం తీవ్రంగా య‌త్నించిన చ‌ల‌మ‌ల కృష్ణారెడ్డి కూడా రేవంత్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. టికెట్ ఖ‌రారైన నేప‌థ్యంలో విభేదాలు వీడి పార్టీ గెలుపు కోసం క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌ని ఈ సంద‌ర్భంగా కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి సూచించిన‌ట్లు స‌మాచారం.

More Telugu News