Nandyal District: స్కూల్ ను ఆక్రమించి ఇంటిగా మార్చుకున్న వైసీపీ నేత

YSRCP leader grabbed school

  • నంద్యాల జిల్లా పాణ్యంలో అధికార పార్టీ నేత ఆగడం
  • ఖాళీగా ఉన్న స్కూల్ ను ఆక్రమించి, నివాసానికి అనుకూలంగా మార్చుకున్న వైనం
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు

ఏపీలో కొందరు వైసీపీ నేతలు చేస్తున్న పనుల వల్ల అధికార పార్టీకి చెడ్డపేరు వస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు తీరు మార్చుకోవడం లేదు. తాజాగా నంద్యాల జిల్లా పాణ్యంలో ఓ వైసీపీ నేత బరితెగించిన విధానం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. 

వివరాల్లోకి వెళ్తే, పాణ్యంలోని ఇందిరా నగర్ లో చెంచు గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం 2013లో రూ. 5.30 లక్షలతో పాఠశాలను నిర్మించింది. అయితే ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉందనే కారణంతో దాన్ని మూసేశారు. ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులను వేరే స్కూల్ కు తరలించారు. 

ఈ క్రమంలో, ఆ స్కూల్ ను స్థానిక వైసీపీ నేత ఒకరు ఆక్రమించుకున్నారు. అంతేకాక, తాను అందులో నివసించేందుకు వీలుగా బిల్డింగ్ లో మార్పులు కూడా చేయించుకున్నారు. దీనిపై స్థానికులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Nandyal District
YSRCP
Leader
Panyam
School

More Telugu News