: బాసర కు వేసవి రద్దీ


ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకటిలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో తమ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు పోటీపడ్డారు. మన రాష్ట్రం నుంచే కాక పొరుగురాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తడంతో దేవాలయం ఆవరణ జనసంద్రమైంది. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానమాచరించి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయాధికారులు ఏర్పాట్లు చేసారు.

  • Loading...

More Telugu News