Google job: గూగుల్ లో ఉద్యోగం కోరుకుంటే.. రెజ్యూమ్ లో ఈ తప్పులు చేయకండి..!

Want to get a job in Google Dont write these five things in your resume

  • రెజ్యూమ్ సూటిగా, సుత్తి లేకుండా ఉండాలి
  • దరఖాస్తు చేసుకుంటున్న ఉద్యోగానికి సంబంధించి నైపుణ్యాలు చెబితే చాలు
  • పూర్తి చిరునామా పేర్కొనాల్సిన అవసరం లేదు
  • గూగుల్ సీనియర్ రిక్రూటర్ సూచనలు

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం, ప్రతి  ఒక్కరి నిత్య జీవితంలో భాగమైన గూగుల్ లో ఉద్యోగం చేయాలన్న కల చాలా మందికి ఉంటుంది. అయితే అలా కోరుకునే వారు రెజ్యూమ్ లో తప్పులు లేకుండా జాగ్రత్త పడడం ముందుగా చేయాల్సిన పని. ఎందుకంటే ఉద్యోగం కోరుతున్న వ్యక్తి నైపుణ్యాలు, వ్యక్తిత్వానికి రెజ్యూమ్ అద్దం పడుతుంది. కాబట్టి, శోది సమాచారంతో నింపేయకుండా.. సూటిగా, కావాల్సిన ముఖ్యమైన పాయింట్లనే హైలైట్ చేసే విధంగా ఉండాలి.

షికాగోకు చెందిన గూగుల్ సీనియర్ రిక్రూటర్ ఎరికా రివెరా రెజ్యూమ్ ను ఆకర్షణీయంగా ఎలా రూపొందించుకోవాలన్న దానిపై టిప్స్ తో టిక్ టాక్ వీడియోను విడుదల చేశారు. దీన్ని ఇప్పటికే 20 లక్షల మంది చూశారు. ఆ వీడియోలో ఆమె చేసిన సూచనలు ఇలా ఉన్నాయి. 

పూర్తి అడ్రస్ ఎందుకు?
రెజ్యూమ్ లో చాలా మంది తమ పూర్తి చిరునామా ఇస్తుంటారు. ఇలా చేయవద్దంటున్నారు రివెరా. వారు ఉంటున్న పట్టణం, రాష్ట్రాన్ని పేర్కొంటే సరిపోతుందని సూచించారు. 

పని వివరాలు
తమ పూర్వపు ఉద్యోగ వివరాలను రెజ్యూమ్ లో పేర్కొనడం సాధారణం. కానీ, గతంలో చేసిన ఉద్యోగాల తాలూకూ సంపూర్ణ సమాచారం అవసరం లేదంటున్నారు రివెరా. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాల వరకే తాము చూస్తామని చెప్పారు. కనుక రెజ్యూమ్ లో వర్క్ హిస్టరీ మొత్తం అవసరం లేదని, అడిగినప్పుడు చెబితే సరిపోతుందంటున్నారు.

బలహీన పదాలు వద్దు
‘ఐ హెల్ప్ డ్, ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్’ ఈ తరహా బలహీన పద నిర్మాణాలు వద్దంటున్నారు రివెరా. ప్యాసివ్ లాంగ్వేజ్ కు బదులు.. యాక్టివ్ వెర్బ్ లు అయిన ‘స్ట్రీమ్ లైన్డ్, ఇంప్లిమెంటెడ్, ఇంప్రూవ్డ్, స్ట్రాటజైజ్డ్, ఇంక్రీజ్డ్, ప్రొడ్యూస్డ్ వంటివి వినియోగించాలని సూచించారు. 

రిఫరెన్స్
ఇక ఫలానా కంపెనీలో రోల్ కోసం రెజ్యూమ్ పంపే వారు.. ఆ కంపెనీలో అప్పటికే పనిచేస్తున్న తమ సంబంధీకుల రిఫరెన్స్ ను పేర్కొంటుంటారు. అయితే, కంపెనీలు అడిగితేనే రిఫరెన్స్ ను పేర్కొనాలని రివెరా సూచించారు. కంపెనీలు రిఫరెన్స్ కావాలంటే ముందే అడుగుతాయని.. దరఖాస్తుదారులు సీవీల్లో పేర్కొనాల్సిన అవసరం లేదంటున్నారు. అలాగే, రెజ్యూమ్ టాప్ లో ఆబ్జెక్టివ్ కూడా వద్దని, ఇది కాలం చెల్లిన విధానమని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News